ఏలూరు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
1 min readటపాసులు వినియోగించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అన్ని వర్గాల వారు బేధ విభేదాలు లేకుండా జరుపుకునే రంగుల పండుగ దీపావళి అని ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు మరియు మీడియా మిత్రులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో దీపావళి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళిని. ఈ సంవత్సర కాలమంతా సిరుల తల్లి లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంటిపై కురిసి, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. రైతులు, యువత, మహిళలకు కూటమి ప్రభుత్వంలో కొత్త అవకాశాలు కల్పిస్తూ వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎల్లప్పుడు తన అండదండలు ఉంటాయని ఎంపీ మహేష్ కుమార్ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ దీపావళి కానుకగా దీపం పథకం ద్వారా అక్కాచెల్లెమ్మలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లులను ఉచితంగా అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల జీవితాల్లో నూతన వెలుగులు నింపారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ దీపావళి పండుగ కష్టాల చీకట్లు తొలగిపోయి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. చిన్నారులు, యువత బాణసంచా కాల్చే సమయంలో పెద్దలు, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.