పాఠశాలల్లో భోజనంపై ఎంపీ శబరి ఆగ్రహం..
1 min readప్రజల నుండి వినతులు స్వీకరించిన నంద్యాల ఎంపీ శబరి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని కొందరు మధ్యాహ్న భోజనం నిర్వాహకుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అలాంటి వారి పద్ధతి మార్చుకోవాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు.శనివారం నందికొట్కూరు పట్టణంలోని మహాత్మగాంధీ మెమోరియల్ ప్రభుత్వ బాలుర పాఠశాల,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆకస్మిక తనిఖీ చేపట్టారు.ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నాణ్యమైన ఆహారంతో పాటు వంట శాలలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. కొందరు నిర్వాహకులపై ఎంపీ శబరి అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలల హెచ్ఎం లు కూడా మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలని ఎంఈఓ నిరంతర పర్యవేక్షణ అవసరం అని ఎంపీ కోరారు.అలాగే పటంలోని ఎంపీ స్వగృహం దగ్గర వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి వినతి పత్రాలను ఎంపీ స్వీకరించారు. వినతుల్లో కొన్నింటిని అధికారులతో ఎంపీ ఫోన్ లో మాట్లాడి కొన్ని సమస్యలను పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, నాగేశ్వరరావు,తర్తూరు సర్పంచ్ పీఎం నాగిరెడ్డి,ఉప సర్పంచ్ శివారెడ్డి,బి మురళీధర్ రెడ్డి,బంగారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.