కేశఖండన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం కోండాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి సుంకన్న మాదిగ మనవడి కేశఖండన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ జె ప్రకాష్ మాదిగ .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటం లక్ష డప్పులు వెయ్యి గోంతులు కార్యక్రమం ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాద్ నగరంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తలపెట్టిన ఈ కార్యక్రమానికి పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.కాబట్టి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంతాల వారికి తెలియజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధం శ్రీనివాస్, మాదిగ కిష్టన్న మాదిగ, రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ మాదిగ, అధికార ప్రతినిధి అక్కులప్ప మాదిగ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు వన్నూర్ స్వామి మాదిగ, చిప్పగిరి మండల అధ్యక్షులు కరెంటు గోవిందు మాదిగ, వినోద్ కుమార్, సీనియర్ నాయకులు వీరాంజనేయులు మరియు ఖాజీపురం రాంబాబు పాల్గొన్నారు.