భరతమాత ముద్దుబిడ్డ శ్రీమతి ఇందిరా గాంధీ
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భరతమాత ముద్దుబిడ్డ శ్రీమతి ఇందిరాగాంధీని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ పి మురళీకృష్ణ ఆమె సేవలను కొనియాడారు. శ్రీమతి ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిందని భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారికి కుమార్తెగా భారత తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారని భావితరాల కోసం నిస్వార్థ సేవలు అందించి వీర వనితగా అడుగడుగునా కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి ప్రజా సేవకు తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి శ్రీమతి ఇందిరాగాంధి గారని, మాతృదేశ సేవలో తన ప్రతి రక్తపుబొట్టు తరిస్తుందని చెప్పి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు బ్యాంకుల జాతీయీకరణతో రైతులు, చిన్న పరిశ్రమలు, పేదలకు ఎంతో మేలు కలిగించారని రాజ భరణాల రద్దు, ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళిక, సర్కారియా కమిషన్ ఏర్పాటు, అంటరానితనం నిర్మూలన మొదలగు వాటితో ఎన్నో ప్రయోజనాలు పేదప్రజలకు లభించాయని అలాగే శ్రీమతి ఇందిరా గాంధీ పుట్టినరోజు బంగ్లాదేశ్ విమోచన దినంగా జరుపు కుంటున్నామని 1971కి పూర్వం పాకిస్తాన్ సైనికులు పాకిస్థాన్ ప్రజలు, బెంగాలి పౌరులు మహిళలు, విద్యార్థుల పై హత్యలు, అత్యాచారాలు చేసి హింసించేవారని పాకిస్థానీయుల అకృత్యాలను భరించలేక బెంగాళీ శరణార్థులు మనదేశంలో తలదాచుకుంటే కోటి మందికి ఆశ్రయం కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిదని 1971 సంవత్సరం సైనికచర్య ద్వారా అత్యంత నైపుణ్యంతో చాకచక్యంగా భారత వైమానిక బలగాలు పాక్ సైన్యాన్ని యుద్ధం లో మట్టికరిపించి బంగ్లాదేశీయులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికే దక్కుతుందని. పరదేశంపై సైనిక చర్య అవసరమా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు శ్రీమతి ఇందిరా గాంధీ గారు సమాధానమిస్తూ మాఇంటి ఆడపడుచులే కాదు పక్కింటి ఆడపిల్లలకు అన్యాయం జరిగిన చూస్తూ ఊరుకోనని సమాధానమిచ్చిన వీరవనిత శ్రీమతి ఇందిరాగాంధీ ని మురళీకృష్ణ ఆమె సేవలను కొనియాడారు. ముందుగా పార్టీ కార్యాలయంలో ఆమె 107 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక రాజవిహార్ సెంటర్ నందలి శ్రీమతి ఇందిరాగాంధ కాంస్య విగ్రహమునకు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఐఎన్టియుసి అధ్యక్షుడు బి బతకన్న, కాంగ్రెస్ నాయకులు వెంకట రెడ్డి. పోతుల శేఖర్ యన్ సి బజారన్న ఎన్ చంద్రశేఖర్ షేక్ ఖాజా హుస్సేన్ ఎస్ ప్రమీల సాంబశివుడు అనంతరత్నం మాదిగ సయ్యద్ నవీద్ డబ్ల్యూ సత్యరాజు బివి సుబ్రహ్మణ్యం ఖాద్రి భాషా యజాస్ అహ్మద్, ఐ ఎన్ టి యు సి నాయకులు ఎన్ సుంకన్న, అని ఆనందం. జేమ్స్ అబ్దుల్ హై శేషన్న నడిపన్న జమ్మన్న లోకరమయ్య మొదలగువారు పాల్గొన్నారు.