ఎం టి ఎస్స్ ఉపాధ్యాయులను రెగ్యులర్ ఉపాధ్యాయులుగా గుర్తించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపలి మండల శాఖ ప్రభుత్వాలు చేసిన తప్పులకి ఉపాద్యాయులు బలి అవుతున్నారు.1998 డీఎస్సీ లో మొదటి విడతలో నే క్వాలిఫై ఐనా అప్పటి ప్రభుత్వం అభ్యార్హులు లేరని చెపుతూ 5 మార్కులు తగ్గించి 2 వ విడత మరలా అభ్యర్థులను విడుదల చేసి మొదటి విడత లోనే క్వాలిఫై ఐనా వారిని పక్కన పెట్టీ 2 వ విడతలో క్వాలిఫై అయిన వారికి ఎక్కువ శాతం ఉద్యోగాలకు ఎంపిక చేసింది.దీంతో కలత చెందిన 1998 క్వాలిఫై ఉపాద్యాయులు 1998 నుండి ఎన్నో పోరాటాలు చేసారు.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తప్పక మిమ్మల్ని ఉపాధ్యాయులుగా తీసుకుంటా అని మాట ఇచ్చారు.కానీ రాజశేఖర రెడ్డి కుమారులు అయిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీ నాన్న మాట ఇచ్చారు మీరు నిలబెట్టుకుని మాకు ఉద్యోగాలు ఇవ్వమని అడగ్గా అనేక ఉద్యమాల ఫలితంగా 1998 వారికి MTS (మినిమం టైం స్కేల్) ఉపాధ్యాయులుగా తీసుకున్నారు.25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఉద్యోగం వచ్చినా అప్పటికే 50 పైబడిన వారు చాల మంది ఉండటంతో కొంత మంది చేరిన నెలల వ్యవధిలోనే రిటైర్ అయ్యారు.ఇంకొంత మంది ప్రమాదాల్లో మృతి చెందారు.వారందరికీ ఇంత వరకు ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్థిక లబ్ధి చేకూరలేదు.ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం వారిని గుర్తించి వాళ్ళను రెగ్యులర్ ఉపాధ్యాయులుగా గుర్తించాలని,ఉపాధ్యాయులకు వచ్చే అన్ని ఆర్థిక లాభాలు వారికి కూడా ప్రభుత్వం ఇవ్వాలని UTF ప్యాపలి మండల సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు.కార్యక్రమం లో యూటీఎఫ్ సీనియర్ నాయకులు బొజ్జన్న, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, సహాద్యక్షులు రమేష్ నాయుడు,జిల్లా కౌన్సిలర్ల సర్వజ్ఞ మూర్తి,ఆంజనప్ప,చంద్రమోహన్, రాజశేఖర్,కంబగిరి ,మధు తదితరులు పాల్గొన్నారు.