PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముచ్చుమర్రి కేసును సీబీఐ కి అప్పగించాలి..

1 min read

మంత్రులను కోరిన సీపీఎం నాయకులు

మంత్రుల ఎదుట ఉద్రిక్త వాతావరణం తోపులాట

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని కొత్త ముచ్చు మర్రి మజారా ఎల్లాల గ్రామానికి చెందిన మదిలేటి సుజాత కూతురు వాసంతి (9) అదృశ్యమై నేటికి 14 రోజులు అయినా ప్రభుత్వం పోలీసులు చేదించడంలో వైపల్యం చెందారని ఈ కేసును వెంటనే సీబీఐ కి అప్పజెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు, సిపిఎం నాయకులు కే భాస్కర్ రెడ్డి,పక్కిర్ సాహెబ్,బెస్తరాజు, టి గోపాలకృష్ణ మంత్రుల ఎదుట డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల చెక్కును అందజేయడానికి వచ్చిన రోడ్లు భవనాల శాఖ మంత్రి మరియు మైనార్టీ శాఖ న్యాయశాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,ఎన్ ఎండీ ఫరూక్ లకు సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసంతి కుటుంబానికి 10 లక్షలు కాదు 25 లక్షలు 5 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మంత్రులకు వినతి పత్రం ఇస్తుండగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తోపులాట చోటు చేసుకుంది సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టడంతో వెంటనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకొని సిపిఎం నాయకులతో మాట్లాడుతూ బాధితుల కోసం మీరు పని చేస్తున్నారు మేము కూడా బాధితుల కోసం పనిచేస్తున్నాము మీరు ఏ  సమస్య తీసుకువచ్చినా మా ప్రభుత్వం ప్రజల పక్షాన పేదల పక్షాన పనిచేస్తుందని మీ న్యాయమైన డిమాండ్స్ ను మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.హోంమంత్రి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ఆమె వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

About Author