మొక్కు తీర్చుకోనున్న ముండ్ల- సంఘీభావం తెలిపిన పుత్తా
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అదేవిధంగా కమలాపురం నియోజకవర్గం లో పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కుకున్న టిడిపి తెలుగు యువత అధికార ప్రతినిధి ముండ్ల శ్రీనివాసరెడ్డి తిరుమల పాదయాత్ర రెండవ రోజు రాజంపేటకు చేరుకుంది అయితే ముండ్ల శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పుత్తా నరసింహారెడ్డి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర రెండవ రోజు గురువారం రాజంపేటకు చేరుకున్న సమయంలో రాజంపేటకు వెళ్లి ముండ్ల కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకొని వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పుత్తానరసింహారెడ్డి మాట్లాడుతూ, ఎంతోమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ గెలుపు కోసం కష్టపడ్డారని వారి కష్టం వృధా పోకుండా అత్యంత మెజారిటీతో పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గెలుపొందడమే కాకుండా అత్యధిక సీట్లతో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ఇది పూర్తిస్థాయిలో ప్రజా ప్రభుత్వమని ప్రజా సమస్యలు పక్కాగా తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అని ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఒక అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాదయాత్ర సవ్యంగా జరగాలని ఆ తిరుమలేశుని కృపా కటాక్షం తో అంతా మంచే జరగాలని ఈ సందర్భంగా ముండ్ల శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సుబ్బరాయుడు, సుధాకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.