మున్సిపల్ కమిషనర్ సుడిగాలి పర్యటన
1 min readసిబ్బంది పనితీరు, హాజరు పై క్షేత్రస్థాయిలో పరిశీలన
ఫిర్యాదుదారులు టోల్ ఫ్రీ కి ఫోను ద్వారా, నేరుగా కార్యాలయానికి రాగలరు
సిబ్బంది అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు పట్టణంలో వివిధ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు.ఉదయం 5 గంటలకు సర్కిల్ నెంబర్ 5, 6 లలో ,నవయుగ హోటల్ దగ్గర మరియు సాయి నగర్ సచివాలయంలోను పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు.శాఖల సిబ్బందికి, కార్మికులకు తగు సూచనలు చేశారు.పోనంగిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ను,వర్మీ కంపోస్ట్ యూనిట్ ను పరిశీలించారు.రాజరాజేశ్వరి నగర్ లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ప్రక్కన ఉన్నటువంటి రైతు బజార్ ను ,పతేబాద్ రైతు బజార్ ను పరిశీలించి ఎస్టేట్ ఆఫీసర్లతో మాట్లాడి తగు నిబంధనలు పాటించాలని, మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని వ్యాపారస్తులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.కార్పొరేషన్ ఆఫీసులో వున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) నుంచి శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు, సెక్రటరీ ల హాజరుని, చేస్తున్న పనిని పర్యవేక్షించారు. వార్డుల్లో వచ్చే ఫిర్యాదుల వెంటనే పరిష్కరించాలని మరియు పని దినాలలో అలసత్వం వహించిన శాఖ పరమైన చర్యలు తప్పమన్నారు.ఫిర్యాదుల పరిష్కారానికి 24 గంటలు పనిచేసే కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెంబర్ 8978999955. ల్యాండ్ లైన్ నెంబర్ 08812232101టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 4287 ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు.లేదా తమ కార్యాలయానికి వచ్చి నేరుగా నన్ను (కమిషనర్) కలవచ్చునన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి పరిరక్షించారు.