PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరు వ్యాపారస్తులు దుకాణాలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు

1 min read

ట్రాఫిక్ అంతరాయాల కారణంగానే చర్యలు తీసుకుంటున్నాం

ఆక్రమణలు తగదు అంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు సి అర్ రెడ్డి కాలేజ్ దగ్గర శుక్రవారం కార్పొరేషన్ అధికారులు దుకాణాలను తొలగించారు. దుకాణాలను తొలగిస్తున్న కార్పొరేషన్ అధికారులకు రోడ్డు వెంబడి వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారస్తులకు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది.ఆక్రమణలకు  గురై ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉండడంతో కమీషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆదేశాలతో  అక్కడ ఉన్న దుకాణాలను తొలగిస్తున్న అట్లు  టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో సర్ సి ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల, సియా రెడ్డి పబ్లిక్ స్కూల్, ఉన్నతాధికారుల కార్యాలయాలు, జిల్లా జడ్జిల నివాస ల సముదాయం,మలుపు లో రైల్వే ట్రాక్ వెళ్లే కాజ్ వే మార్గం ఇలా ప్రతినిత్యం వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, రాకపోకలు సాగిస్తుంటారు. పలుమార్గాలు ఉండటంతో పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు వాహన చోదలకు, ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ఇబ్బందులు గురైనట్లు శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఈ రోడ్డును వెంబడి వట్లూరు ప్రాంతం వరకు రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారస్తులు వందల సంఖ్యలో దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారులు సాగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంత నివారించిన వారికి కూడా అంతుచిక్కని విధంగా ఈ వ్యవహారం ఉంది. ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు చిరు వ్యాపారస్తులకు ఏదైనా వారికి ఉపాధి చేసుకోవటానికి తగిన మార్గం చూపిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అన్నది ప్రజల అభిప్రాయపడుతున్నారు.

About Author