PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలి..

1 min read

ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుసరించి అత్యంత జాగ్రత్తతో కౌంటింగ్ నిర్వహించాలి

శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా కౌంటింగ్ పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్  పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై సంబంధిత అధికారులకు ఏవిధమైన అవగాహన వుందో తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేసి  సమాధానాలు రాబట్టి, వారు వెల్లిబుచ్చిన పలు అంశాలను  ఆయన నివృత్తి చేశారు.  ఈ శిక్షణ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన అంశాలను క్షుణంగా తెలుసుకొని జూన్ 4వ తేదీన కౌంటింగ్ లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ ఫారం-13సి, ఫారం-13ఎ, మరియు ఫారం-13బి లకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. వాటిపై సంపూర్ణ అవగాహన కలిగియుండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ల లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలన్నారు.  ఎలాంటి సొంత అలోచనలకు తావివ్వకుండా ఎన్నికల నిబంధనలను విధిగా పాటించి ఓట్లలెక్కింపు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ డి. పుష్పమణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. బాబ్జి, ఏలూరు ఆర్డిఓ ఎన్ ఎస్ కె ఖాజావలి, సర్వశిక్షా అభియాన్ ఎపిసి బి. సోమశేఖర్, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author