మీసాలు గడ్డాలు గురించి కాదు.. అభివృద్ధిలో దమ్ము చూపించండి
1 min readనాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన చెన్నకేశవరెడ్డి కి కూడా మీసాలు లేవు_
168 టీసీలకు ఎన్నికలు జరిగితే.. పార్లపల్లి గ్రామానికి ఎందుకు వెళ్లారు_
కడిమెట్ల గ్రామానికి తాగడానికి నీళ్లు ఇచ్చేది మీసాలు లేని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డినే
మాజీ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేయడం బాధాకరం
పోలీసుల అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డిపై ఫైర్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో మీసాలు, గడ్డాలు గురించి మాట్లాడడం కాదు.. అభివృద్ధి చేసి దమ్ము చూపించాలి.. మీసాలు లేని ఎమ్మెల్యే అని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి స్పందించారు. సోమవారం స్థానిక సోమప్ప సర్కిల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఐదుసార్లు గెలిచిన నా తండ్రి మాజీ మంత్రి బీవీ మోహన్ కి కూడా మీసాలు లేవు.. తాను రెండుసార్లు గెలిచిన జయనాగేశ్వర్ రెడ్డి కి కూడా మీసాలు లేవు.. నాలుగు సార్లు గెలిచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కి కూడా మీసాలు లేవన్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉనికిని కాపాడుకునేందుకు కాల్వ సమస్య తెచ్చిపెట్టి డ్రామాలు మొదలు పెట్టారన్నారు. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన సిఐని మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని, ముందు ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో రికార్డ్ చేయకుండా దౌర్జన్యం చేసినట్లు చెప్పడం సరికాదన్నారు. నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన శివన్న నగర్ పట్టాల విషయంలో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే అప్పుడు ఇదే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పోలీసులు అడ్డం పెట్టుకుని ధ్వంసం చేయించినప్పుడు అప్పుడు పోలీసులు మంచివారు. ఇప్పుడు మీకు చెడ్డగా కనబడుతున్నారా అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో 168 టిసి ఎన్నికలు జరుగుతుంటే కేవలం పార్లపల్లి గ్రామానికి వెళ్లి అడ్డం పడ్డారన్నారు. మీ సొంత లబ్ధి కోసమే తాపత్రం పడుతున్నారని, రైతులు ప్రజల కోసం కాదని తెలిసిపోయిందన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి వెయ్యని రోడ్లను రోడ్లు వేసి చూపిస్తున్నది మీసాలు లేని ఎమ్మెల్యేనని, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులులో దొంగలు మోటర్లు అమ్ముకుంటే కోటి రూపాయలు నిధులు మంజూరు చేయించింది మీసాలు లేని ఎమ్మెల్యేలని, 24 గంటల పాటు పట్టణానికి తాగునీరు అందించే ప్రాజెక్టును 146 కోట్లు మంజూరు చేయించింది మీసాలు లేని ఎమ్మెల్యేలను, ఎమ్మిగనూరు – కోడుమూరుకు రోడ్డుకు నిధులు తీసుకొచ్చింది కూడా మీసాలు లేని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి అని స్పష్టం చేశారు. అభివృద్ధిలో పోటీపడాలి తప్ప మీసం లేని వారిని ఎమ్మెల్యే గెలిపించింది ఎమ్మిగనూరు ప్రజలు అన్నారు. గత 42 సంవత్సరాల నుండి నేటి వరకు మీ సొంత పొలాలకు మీరే అధ్యక్షులుగా ఉన్నారన్నారు. మాజీ సీఎం జగన్ ఈ ఎన్నికలు బహిష్కరణ అని చెబుతారు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి పోరాటం చేస్తున్నారు, ఇంతకు మాజీ ఎమ్మెల్యే వైసీపీలో ఉన్నారా లేక ఇండిపెండెంట్ గా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఇంచార్జి బుట్టా రేణుక కూడా ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు తెలుపుతున్నారని. మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి మీ ప్రభుత్వంలో ఆర్డీఎస్ ప్రాజెక్టు నాశనం అవుతుంటే అప్పుడు బంద్ చేయలేదు.. టెక్స్ టైల్ పార్కు తీసుకురావడానికి ధర్నాలు బంద్ లు చేయలేదు కేవలం మీ లబ్ధి కోసం బంద్ అన్ని డ్రాములు తీసుకొచ్చారన్నారు. కక్ష సాధింపులకు బీవీ కుటుంబం ఏనాడూ ప్రోత్సహించలేదని, అభివృద్ధిని చేసి చూపించామన్నారు. వైసీపీ నేతలు, నాయకులు చేసిన అవినీతి చిట్టా త్వరలోనే బయట పెడతామని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో కేవలం ఎర్రకోట కుటుంబ సభ్యులు మాత్రమే పదవులు అనుభవించారని, బీవీ కుటుంబం అన్ని వర్గాలకు పదవులు ఇచ్చి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.