ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి… ఆదోని అభివృద్ధే నా సంకల్పం
1 min readఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి
పార్టీలకు ,మతాలకతీతంగా న్యాయం చేస్తానని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.
ఆదివారం ఇద్గా సందర్శనలో
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని ఇద్గా కు రావలసిన నిధులు పైన, జరగాల్సిన అభివృద్ధి పనుల పైన కావలసినటువంటి నిధుల మంజూరు కొరకై ఇప్పటికే మైనార్టీ శాఖ మంత్రి పరుక్ అబ్దుల్లా ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు.దానికి స్పందిస్తూ మైనారిటీ మంత్రి ఎవరు వచ్చినా కూడా వారికోసం వారి కుటుంబం కోసం మాత్రమే కలిసే వారిని మీరు మాత్రం ఆదోని అభివృద్ధి కోసం కలిశారని అన్నారని అన్నారు. ఏ ఒక్కరిని ఆకట్టుకోవడానికి మంత్రులను కలవను , ఎవరిని కలసిన ఆదోని అభివృద్ధి కి సంబంధించిన విషయాలే చర్చిస్తా,గతంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తప్పుడు మేమోలతో జారీ చేసి ముస్లిం మైనార్టీలను తప్పుదోవ పట్టించే విధంగా చేసిందని ఎద్దేవా చేశారు. ఆర్థిక అభివృద్ధి నిధులను ఈద్గా నిర్మించేందుకు ఖర్చు చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఈద్ గా నిర్మణం కొరకు మళ్లించడం అనేది అసాధ్యమైన ప్రక్రియ అన్నారు. ఇద్గా మరియు కబరస్త అభివృద్ది పనులు అతి త్వరలో మంత్రి తో మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని తెలిపారు.కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం నాకు రాదని కేవలం అభివృద్ధి చేయాలనే సంకల్పం తప్ప వేరే ఉద్దేశం లేదని అన్నారు. ‘గరీబ్ హఠావో ‘అనే పదానికి నేను ముందుండి పని చేస్తానని హామీ ఇచ్చారు,మైనారిటీ సామాజిక వర్గంలో బాల కార్మికుల ఎక్కువగా ఉన్నారని వారందరినీ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ మత పెద్దలు ఖతీఫ్ జునాయ్డ్ సాహెబ్, ఖాజీ అల్థాఫ్ హుసేన్ సాహెబ్,Ex.MLA ప్రకాష్ జైన్, జనసేనా నిజయోజకవర్గ సమన్వయకర్త మల్లప్ప ,భాస్కర్ రెడ్డి , ఉమ్మి సలీం, నియాజ్ అహ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు.