బుట్టా రేణుక కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు గా నియమితులైన శ్రీ ఎం.కే. శివప్రసాద్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నాపై నమ్మకం ఉంచి ఈ గొప్ప బాధ్యతను అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి సదా రుణపడి ఉంటాను. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా చేనేత వర్గ అభివృద్ధికి పని చేస్తాను. ముఖ్యంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి స్థాయిలో కృషి చేస్తాను. పార్టీలో నాకు ఇచ్చిన బాధ్యతను న్యాయంగా నిర్వర్తించి నాయకత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాను” అని తెలిపారు.అయితే, చేనేత కార్మికుల సంక్షేమానికి కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేందుకు మద్దతు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న చేనేత వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడంలో, వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడంలో ప్రతిఒక్కరితో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు.అంతేకాకుండా, పార్టీ నాయుకత్వం మరియు కార్యకర్తలందరి మద్దతుతో ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తానని శివప్రసాద్ గారు విశ్వాసం వ్యక్తం చేశారు.