గిరిజన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికోసం నాబార్డ్ కృషి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గిరిజన గ్రామాల సర్వతోముఖ అభివృద్ధి కోసం నాబార్డ్ కృషి చేస్తుందని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఖలీద్ కర్నూలు జిల్లా ఏజీఎం సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం గిరిజన గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలంలోని గిరిజన గ్రామాలైన పెండ్లి మాన్ తండా, మర్రిమాను తండా , గుండు తాండా,బుగ్గ తండా మరియు మాన్సింగ్ తండా గ్రామాలను వారు సందర్శించారు.ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి, వారు ప్రస్తుతం పండిస్తున్న పంటల స్థితిగతుల గురించి, మార్కెట్ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. భూమిలేని రైతుల కార్యక్రమాల గురించి మరియు మహిళలకు కావలసిన జీవనోపాదుల గురించి ఆరా తీశారు.అలాగే గ్రామాభివృద్ధి లో భాగంగా రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నవ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలరెడ్డి మరియు డైరెక్టర్ నరసింహులు మరియు అన్ని గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.