శ్రీశైలం మహా క్షేత్రం లో నాగుల చవితి
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రం లో నాగుల చవితిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగులకట్ట వద్దకు భక్తులుచేరుకొని పత్తితో చేసిన వస్త్రం, యజ్ఞోపవీతం, పలురకాల పుష్పాలు మొదలైన వాటితో నాగమూర్తులను అలంకరించి పాలతో అభిషేకించారు. తరువాత నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదించారు.మన సంస్కృతిలో నాగసంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యం వుంది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా పలుచోట్ల నాగవిగ్రహాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలయ ప్రాకారంపై పలుచోట్ల నాగశిల్పాలను దర్శించవచ్చు. ఈ నాగశిల్పాలలో తూర్పు ప్రాకారంపై గల ఆదిశేషుడు, దక్షిణవైపున గల నాగబంధశిల్పం ముఖ్యమైనవి.