NALSA కొత్త మాడ్యూల్ పథకాలపై అవగాహన శిబిరం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కర్నూలు వారు నేషనల్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు అనగా 24-01-2025 తేదీన స్థానిక సిల్వర్ జూబ్లి కళాశాల యందు నల్సా న్యూ మోడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు ను నిర్వహించారు. ఈ సమావేశనికి ముఖ్య అతిధులు గా కర్నూలు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి /జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. కబర్ధి మరియు కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డి. వి. ర్. సాయి గోపాల్ హాజరయ్యారు. జిల్లా జడ్జి మాట్టాడుతూ NALSA (అసంఘటిత రంగంలోని కార్మికులకు న్యాయ సేవలు) పథకం, 2015 & NALSA (పిల్లల కోసం చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్) పథకం, 2024, బాలికల సాధికారత మరియు వారి హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు కలవని తెలిపారు. జిల్లా న్యాయ సేవాది కార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి మాట్లడుతూ భవన నిర్మాణ కార్మికుల కు గవర్నమెంట్ గుర్తింపు కార్డు మరియు అసంఘటిత కార్మికుల కు ఈ శ్రామ్ కార్డు లు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసిన శిబిరం ద్వారా ఇప్పించడం జరిగింది అని తెలిపారు. జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు శ్రీ కే. కిషోర్ కుమార్ వినియోగ దారుల హక్కుల గురించి వివరించారు. చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల ఈ సమావేశం లో జాతీయ బాలిక దినోత్సవం సందర్బంగా బాల కార్మికుల నిషేధము, బాలికల అక్రమ రవాణా నిషేధము గురించి తెలిపారు. తదనంతము సిల్వర్ జూబ్లీ కాలేజి అఫ్ క్లస్టర్ యూనివర్సిటీ నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తీర్ణులైన పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు గురించి పిల్లలు స్కిట్ ప్రదర్శించారు. అనంతరము అక్కడ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు లేబర్ డిపార్ట్మెంట్ స్టాల్స్ ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను సందర్శిచారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబశివ, డి. సి. పి. ఓ. శారదా, సి. డబ్ల్యూ. సి. చైర్మన్ జుబేదా బేగం, జిల్లా వినియోగ దారుల ఫోరమ్ మెంబర్ నజీమా కౌసత్, సిల్వర్ జూబ్లీ కాలేజి అఫ్ క్లస్టర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ వి. వి. ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్, లెక్చరర్ డాక్టర్ ఎల్లా కృష్ణ, ఎన్. జి. ఓ. డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, అబ్సర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుస్సేన్ బాషా, కళాశాల విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.