నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు విజయోత్స కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుచలన చిత్ర నటులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజు చిత్రం తేదీ 12.01.2025 న విడుదల అయి విజయవంతం గా ప్రదర్శిస్తునందున ఈ రోజు శ్రీ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు ఆర్యశంకర్, సుధాకర్ నాయుడు ల ఆధ్వర్యంలో విజయోత్స కార్యక్రమం నగరంలోని వెంకటేష్ టాకీస్ నందు నర్వహించడం జరిగింది.కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కూడా చైర్మన్ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లుముఖ్యలుగా హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అభిమానులకు అందజేయడమైనదికార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్, పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు పేరపోగు రాజు మొదలగు వారితో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.