పట్టణంలో పురాతన బావికి నందన వనం..
1 min readబావిలో చెత్తా చెదారం..డ్రైనేజీ పనులు చేయించిన కమిషనర్ వైస్ చైర్మన్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: క్రీ పూ.పురాతన బావి.. ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు మారుతూనే ఉన్నారు కానీ ఆ పురాతన భావి వైపు ఎవరు కూడా తొక్కి చూడలేదన్నది నిజం..గత ప్రభుత్వాల్లో పాలించిన పాలకులకు ఇది గుర్తుకు రాలేదేమో.. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం 18వ వార్డ్ లో ఆంజనేయస్వామి దేవాలయం పక్కన ఉన్న పురాతన బావిలో మూడు బావులు ఉన్నాయని పెద్దలు తెలుపుతున్నారు. ఈ వార్డు కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ దృష్టికి ఈ భావి గురించి వివరించారు. ఎందుకంటే ఈ బావిలో అనునిత్యం ఎండాకాలం కూడా ఇక్కడ నీళ్లు ఉంటాయ్ బావిలో చెత్తా చెదారం ఉండటం వల్ల దుర్వాసన రావడం దోమలు ఈగల ద్వారా పట్టణ ప్రజలు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్తతోనే వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ మరియు వైస్ చైర్మన్ తమ పారిశుద్ధ కార్మికులతో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ బావిలోకి దిగి చెత్తాచెదారాన్ని ట్రాక్టర్లలో వేస్తూ వాటిని తొలగించారు.బావిని శుభ్రం చేయడం పట్ల కార్మికులను మరియు కమిషనర్ చైర్మన్ ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.తర్వాత 29 వ వార్డులో కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి మరియు కమిషనర్ వైస్ చైర్మన్ ఆ కాలనీ ప్రజలతో మాట్లాడి డ్రైనేజీ ని శుభ్రం చేయించారు. వార్డులో కల్వర్టు ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు కోరారు.కల్వర్టును రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అంతే కాకుండా మీ కాలనీలో ఏ సమస్య ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా ఇస్తే వాటిని పూర్తి చేస్తామని కమిషనర్ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా పసుల శ్రీనివాస్ నాయుడు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.