PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాఫిక్ జామ్ లో నందికొట్కూర్ పట్టణం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం ప్రధాన రహదారులన్నీ చిక్కుకుపోయాయి. ఉదయం 11:45 నుండి 12:45 వరకు ఆత్మకూరు జాతీయ రహదారి పగిడాల మరియు మిడుతూరు రహదారులన్నీ వాహనాలు అన్ని ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పనుల మీద వెళ్లే వాళ్ళు నిలిచింది పోయి ఎండలకు ప్రజలు ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పెద్దపెద్ద వాహనాలు బస్సులు ట్రాక్టర్లు లారీలు కార్లు ఆటోలు ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయ్ ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది కానీ అక్కడ అధికారులు లేకపోవడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మరి తర్వాత నైనా అధికారులు అక్కడ ఉండి ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తారా.

About Author