ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బనగానపల్లె నియోజకవర్గం : కొలిమిగుండ్ల మండలం : అబ్దుల్లాపురం గ్రామ పరిదిలో చింతలాయపల్లె లో12.01.2025 న రాత్రి సమయంలో చింతలాయపల్లె గ్రామానికి చెందిన శ్రీ నీలం సంజీవ కుమార్ రెడ్డి దాదాపు మూడున్నర ఎకరాలలో వేసిన మునగ పంటను నాశనం చేశారు. ఈ క్రమంలో కాపుకు వచ్చిన దాదాపు 400 మునగ చెట్లు నరికి వేశారు. ఈ సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు బనగానపల్లె మాజీ శాసన సభ్యులు స్వయంగా వెళ్ళి ధ్వంసం చేయబడిన పంటను పరిశీలించడం జరిగినది. పంటను ఎంతో సాగు చేసిన చింతలాయపల్లె గ్రామ నివాసి శ్రీ నీలం సంజీవ కుమార్ రెడ్డి గారు వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు అని ఇది జీర్ణించుకోలేని ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వారి ప్రమేయం ఇందులో వున్నదనే అనుమానం కలుగుతుంది. చేతికి అంది వచ్చు సమయంలో మునగచెట్ల నరికివేత వలన అపార సష్టం సంభవించడమే గాక, పెట్టుబడి క్రింద చేసిన అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొనినది.
జిల్లాలో ఫ్యాక్షన్ వున్న సమయంలో కూడా ఎన్నడూ రైతులు వేసిన పంటల జోలికి పోయిన సందర్భాలు లేవు. కాపుకు వచ్చిన పంట నరికివేత లాంటి విష సంస్కృతి వలన వ్యవసాయ దిగుబడులు సన్నగిల్లడమే గాక రైతుకు అపార నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడినది. పంట నష్ట పోయిన రైతు మా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడైనందున ప్రత్యర్థి రాజకీయ పార్టీ వారి ప్రోత్సాహంతో, అండదండలతో ఈ అమాననీయ సంఘటన చోటు చేసుకున్నదని మేము విశ్వసించుచున్నాం.కావున, జరిగిన ఈ సంఘటన పై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహింపజేయించి, ఇటువంటి విష సంస్కృతి మరింత పాకకుండా అణచివేయుటకు తగు కఠిన చర్యలు తీసుకొని, బాధ్యులైన వారిని గుర్తించి, చట్ట పరంగా శిక్షింప జేస్తారని అలాగే బాదిత రైతుకు తగు నష్ట పరిహారం అందచేయాలి అని కోరారు..
అనంతరం గడివేముల మండలం : పై బోగుల గ్రామంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి సంఘటన గురించి కూడా నంద్యాల జిల్లా ఎస్పీ కి విన్నపించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామిరెడ్డి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మరియు పాణ్యం మాజీ జెడ్పిటిసి సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.