కేంద్ర మినిస్టర్ కి బేడ బుడగ జంగం సమస్యపై నంద్యాల ఎంపీ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ న్యూఢిల్లీ: న్యూఢిల్లీ లో పార్లమెంటు భవనంలోని కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ కి ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం SC కుల రిజర్వేషన్ సమస్య రాష్ట్రము నుంచి కేంద్రమునకు నివేదికలో రావడం జరిగినది. కేంద్రంలో RGI (రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా) నందు పెండింగ్లో ఉన్నది.అక్కడి నుంచి పార్లమెంటుకు వచ్చేలా చూడాలని, ఆంధ్ర రాష్ట్రం నందు కూటమి ప్రభుత్వం ఈ సంచార దళిత బేడ బుడగ జంగం కులమునకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారని, శ్రీమతి బైరెడ్డి శబరి మేడం , సంబంధిత శాఖ కేంద్ర మినిస్టర్ కి తెలియజేస్తూ వినతిని ఇవ్వడం జరిగినది.వీటిపై స్పందిస్తూ కేంద్ర మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ సంబంధిత శాఖకు ఫోన్ చేసి ఫైలు త్వరగా న్యాయం చేసే విధంగా చూడాలని తెలియజేసినదిగా, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు గౌరవ శ్రీమతి బైరెడ్డి శబరి మేడం తెలిపినారు.