PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం…

1 min read

అంబరానంటిన బిజెపి కార్యకర్త ల సంబరాలు 

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : మూడవసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్బాన అలాగే శ్రీ హనుమాన్ జయంతిని శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీ హనుమాన్” 15 అడుగుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిజెపి నాయకత్వంలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయు శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు, నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న సంక్షేమ అభివృద్ధి నే బిజెపికి శ్రీరామరక్ష అని వారు తెలిపారు, అన్ని వర్గాల ప్రజలకు బిజెపి అండగా ఉండి, వారి అభ్యున్నతికి ఎంతో దోహద పడిందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమలపురం బీజేపీ కో కన్వీనర్ టీ. ఏ.భరత్ రెడ్డి , జిల్లా బీజేవైయమ్ జనరల్ సెక్రటరీ బి. వీర ప్రతాప్ రెడ్డి , మండల బీజీపీ నాయకులు లోమడ శివా రెడ్డి, ఖాశీ విశ్వనాథ్, ఖాశి,ఖాసిమ్, బీ. శివా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author