ఏస్పాభారత్ ఆధ్వర్యంలో నేషనల్ ఆక్యుపంక్చర్ డే ఉత్సవాలు..
1 min readడాక్టర్ మాకాల సత్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఏస్పా భారత్ కార్యాలయంలో నేషనల్ ఆక్యుపంక్చర్ డే ఉత్సవాలు నిర్వహించి నట్లు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. అనేక రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్రతినిధులు పాల్గొని, ది 16-10-2024 తేదీ వరల్డ్ ఆక్యుపంక్చర్ డే వరకు దేశవ్యాప్తంగా ఆక్యుపంక్చర్ ను అవగాహన చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఉత్సవాల బ్రోచర్ ను రిలీజ్ చేయటం జరిగింది.ఆక్యుపంక్చర్ ను కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.ఆక్యుపంక్చర్ సైన్స్ ఒక జీవన విధానం అని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరంఅని ప్రపంచమంతా తెలియ చేశాల ఆంధ్ర ప్రదేశ్ అక్యుపంక్చర్ ప్రాక్టీషనర్స్ కన్వీనర్ గా డా,, కాశీ మహంతి సునీత, ఎన్నుకొనబడినారు, తెలంగాణ కన్వీనర్ గా ఏవీఎస్ కుమారస్వామి, ఒరిస్సా కు శ్రీమతి శ్యామల, యానంకు అక్యుపంకచర్ స్వామి, వెస్ట్ బెంగాల్ కు తవుసిఫ్ కన్వీనర్లు గా ఎన్ను కొనబడినారు. ఎస్పా భరత్ అధ్యక్షుడు డా, అలవాల రవి, ఉపాధ్యక్షుడిగా జ్యోతి రాజు, ముంజంపల్లి శివకుమార్, ఆర్య రాజకుమారి, ప్రవీణ్ కుమార్.జాయింట్ సెక్రటరీగా భూతపాటి ఉదయ్ కుమార్, అశ్రపునిష, చీర్ల రాధాకృష్ణ, నారగాని ప్రసాదు, కోశాధికారిగా కొండవీటి సుమతి, ఎన్నుకోన బడినారు. ప్రజలందరూ మందులు అవసరంలేని ఆరోగ్య విధానం అలవర్చుకొని మేలు పొందాలని డాక్టర్,మాకాల సత్యనారాయణ కోరారు.