జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్చార్జిగా ఎస్ రమేష్ గౌడ్ నియామకం
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో జరిగిన బీసీ నాయకుల సమావేశంలో ప్యాపిలి మండలానికి చెందిన ఎస్సీ రమేష్ గౌడ్ ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్యాపిలి మండల ఇన్చార్జిగా నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరావు యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ప్రకటించారు. బీసీల కోసం అను అహర్నిశలు పనిచేస్తారని రమేష్ గౌడ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్యాపిలి మండల స్థాయిలో గ్రామీణ, వార్డు స్థాయిలో కమిటీల ఏర్పాటుకు తన కృషి చేస్తానని రమేష్ గౌడ్ తెలియజేశారు.