సెయింట్ తెరిసా మహిళ కళాశాలలో..జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుక
1 min readరాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించిన రిటైర్డ్ జడ్జ్ అడబాల లక్ష్మి
పాల్గొన్న ప్రిన్సిపల్,వైస్ ప్రిన్సిపల్,అధ్యాకులు, సిబ్బంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :సెంటు మహిళ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ కర్యక్రమంలో భాగంగా భారత రాజ్యంగ పితామహు లైన డా.బి.ఆర్. అంబేద్కర్ పటానికి పూలమాలలో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిస్సిపల్ డా:సిస్టర్ మెర్సీ, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియ ఈ కార్యక్రముకు ముఖ్య అతిధిలుగా విచ్చేశారు.రిటైర్డ్ జడ్జి అబాడాల లక్ష్మి రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ మెర్సీ రాజ్యాంగ పీటికను విద్యార్థినీలతో ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ ప్రవేశిక యొక్క స్వేచ్చ, సమానత్వము, న్యాయం, సౌ భ్రాతృత్వము అనే మూలాలు గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా విశదేకరించారు. కళాశాల సాంఘిక శాస్త్రాల విభాగాధిపతి డా:పి. రత్న మేరీ, ఆర్.చిట్టెమ్మ రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు మరియు మనస్తత్వ శాస్త్ర అధ్యాపకురాలు జి.ఏమ్.ఆర్. జోస్పిన్ గార్ల ఆద్వర్యములో క్విజ్ పోటిని నిర్వహించి భారత రాజ్యాంగ పై అవగాహన కల్పించారు. ఈ పోటిలో గెలుపొందిన విద్యార్థినీలకు ఏ.వి.ఆర్ విజ్ఞాన కేంద్రము వారి సహకారంతో బహుమతి ప్రధానము చేసారు. కళాశాల ప్రిన్సిపాల్ డా:సిస్టర్ మెర్సీ , సిస్టర్ మరియా క్రిస్టియ, గుడిపాటి నరసింహ రావు, పి.వి.రమణ, ఎస్ రవి, డా:వెంకటేశ్వర్లు, డిప్యూటి ఇంజనీరు దేవరకొండ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఆర్.చిట్టెమ్మ రాజనీతి శాస్త్ర అధ్యపకురాలు భారతరాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రపంచంలో అతి పెద్ద భారతరాజ్యాంగం పౌరులందరికీ కల్పించిన హక్కులు, బాధ్యతలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్న మేరీ, అనూష,బీ కుమారి, భాగ్యలక్ష్మి, మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.