జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024
1 min readనేటి నుండి ఏలూరు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు
కెపిడిటి హైస్కూల్లో తూనికలు కొలతలులోమోసాలపై వినియోగదారులకు అవగాహన సదస్సు
లీగల మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జాతీయ వినియోగదారుల దినోత్సవం, 2024 వారోత్సవాలులో భాగంగా (ది. 18.12.2024 తేదీ నుండి 24.12.2024 వరకు) ఏలూరు జిల్లా నందు అవగాహనా సదస్సులు ఈ క్రింది చూపబడిన ప్రదేశములలో నిర్వహించడం జరిగినది.23-12-2024 వ తేదిన కెపిడిటీ హై స్కూల్, అశోక్ నగర్, ఏలూరు నందు ఉప నియంత్రకులు, సహాయనియంత్రకులు మరియు పరిశీలకులు వారు తూనికలు కొలతల యొక్క వినియోగం, రైతు బజార్ చికెన్, మటన్ మరియు కిరాణా షాపులలో వివిధ వ్యాపారస్తులు వివిధ రకములైన జరిగే మోసాలపై అవగాహన కల్పిస్తూ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. కేపిడిటి హై స్కూల్ నందు ఈరోజు లీగల్ మెట్రాలజీ శాఖ వారు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు తూనికలు కొలతలలో జరిగే వివిధ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఎలక్ట్రానిక్ కాటాలలో మోసంపై వివరిస్తూ తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని ఉపయోగించి దాని బరువు తెలుసుకొని, అనుమానం ఉన్న కాటాపై ఉంచినచో తప్పుడు తూనీకలను ఏ విధంగా గుర్తించవచ్చు వివరించారు. బంగారం కొనుగోలు చేయనప్పుడు బిల్లులో దాని బరువు మరియు రాళ్ల బరువు విడిగా ఉండే టట్లు చూసుకోవాలని సూచించారు మరియు దాని యొక్క స్వచ్ఛతను పొందుపరచాలని వివరించారు.పెట్రోల్ పంప్ లో వినియోగదారులు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు మీటర్ రీడింగ్ విధిగా జీరో నుంచి మొదలవుతుందో లేదో చూసుకోవాలి, ఏదైనా అనుమానం ఉన్నచో పెట్రోల్ పంప్ డీలర్ వద్ద ఉన్న ఐదు లీటర్ల కొలమానంపై సరి చేసుకొనవచ్చును. ప్యాకేజీలపై ముద్రించవలసిన తయారీదారుని పేరు, ప్యాకేజి చేయబడిన వస్తువు పేరు, దాని నిఖర బరువు , ప్యాకేజి తయారు చేయబడిన తేది దాని ఎంఆర్పి ధర కన్స్యూమర్ కంప్లైంట్స్ కై ఉండవలసిన సెల్ ఫోన్ నెంబర్ మరియు ఇ మెయిల్ తదితరాలపై అవగాహన కల్పించారు. ఎంఆర్పి ధర కంటే ఎవరు ఎక్కువ అమ్మకూడదని వారికి వివరించారు.ఈ సదస్సులలో వినియోగదారులకు నిర్వహించిన కార్యక్రమముల వివరములు ఈ క్రింది చూపడమైనది.కార్యాలయం పేరు తేదిసదస్సు నిర్వహించినప్రదేశము సహాయనియంత్రకులు, లీ.మె. ఏలూరు19-12-2024భీమడోలు – అంబర్ పేట – అగ్రికల్చర్పల్మొయిల్ రైతులకు పరిశీలకులు, ఏలూరు 18-12-2024భీమడోలు – వారపు సంత19-12-2024పంగిడిగూడెం-వారపు సంత20-12-2024వేలేరుపాడు-వారపు సంతఈ కార్యక్రమములో సంయుక్త నియంత్రకులు సుధాకర్ గారు, ఉప నియంత్రకులు హరిప్రసాద్, సహాయనియంత్రకులు సాయి రామ్, పరిశీలకులు ప్రశాంత్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.