డిసెంబర్ 14 న జాతీయ లోక్ అదాలత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ జి కబర్ది ఆదేశాల మేరకు డిసెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను, జిల్లా కోర్టు, మున్సిఫ్ కోర్టు ఆవరణం మరియు అన్ని మండల న్యాయసేవాధికార సంస్థలలో నిర్వహిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా న్యాయ సేవ సదన్ నందు డిసెంబర్ 14 న జరిగే జాతీయ లోక్ అదాలత్ పై జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ మేజిస్ట్రేట్ టి జ్యోత్స్నాదేవి, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ ఎం సరోజినమ్మ మాట్లాడతూ పోలీసులు వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే దిశగా కృషి చేయాలనీ కోరారు. ఈ సదస్సులో కర్నూలు టౌన్ సి.ఐలు, ఎస్.ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కోర్ట్ కానిస్టేబుల్లు పాల్గొన్నారు.