నేషనల్ మజ్దూర్ యూనిట్ సర్వ సభ సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో స్థానిక ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎమ్మిగనూరు రాజేశ్వరి లాడ్జ్ మీటింగ్ హాల్ నందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ ఎం యు ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ పి ఎం సాబ్ అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎంయుఏ రాష్ట్ర కార్యదర్శి పిఎండి ఇస్మాయిల్ మరియు రీజనల్ కార్యదర్శి శ్రీ మద్దిలేటి గారెలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి పిఎండి ఇస్మాయిల్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే దిశలో ఎన్ఎంయుఏ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అహర్నశలు కృషి చేస్తున్నారని డిపో స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈనెల ఏడవ తేదీన విజయవాడలో జరిగిన ఎన్ ఎం యు ఏ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్ ఎం యు ఏ విజయవాడలో సొంత బిల్డింగ్ను కట్టించాలని తీర్మానాన్ని చేశారని దానికి సంబంధించి ఉద్యోగులు తమ విరాళాలను ప్రకటించాలని వై ఆర్ చంద్ర 15116, ఎన్పీఎం సాహెబ్11116, ఎస్ఎం రఫిక్10000,యు ఎమ్ శేఖర్5116, యు గోపి రిటైర్డ్ 5116, తిమ్మప్ప2116, కోసిగయ్య2016,అందజేశారు. మద్దిలేటి మాట్లాడుతూ విలీనానంతర ఏపీఎస్ఆర్టీసీలో సమస్యలపై నేషనల్ మత్తు యూనిటీ అసోసియేషన్ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతుందని విలీనానంతరం అపరిష్కృత సమస్యలు పరిష్కరించేందుకు ఎన్ఎంయు ఏ లిఖితపూర్వకంగా సమస్యల పరిష్కారం కోసం అనంతరం కృషి చేస్తుందని ప్రభుత్వానికి తెలియజేయడంలో ముందంజలో ఉందని ఆయన తెలిపారు. సమస్యల విషయానికొస్తే ఇదివరలో ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి నగదు రహిత వైద్య సదుపాయము ఉండేదని ఈ హెచ్ ఎస్ విధానాన్ని రద్దు పరచి పాత అపరిమిత వైద్యసేవల విధానాన్ని కొనసాగించాలని, ప్రయాణికులు టిక్కెట్ తీసుకోకపోతే డ్రైవర్ కండక్టర్లకు విధిస్తున్న జరిమానాలకు సంబంధించి 2019 సర్కలర్ను తిరిగి అమలు చేయడం చేయాలని, సంస్థాగతంగా ఖాళీ స్థానాల్లో సిబ్బందిని భర్తీ చేయాలని, స్క్రాప్ కు వెళ్లే బస్సులను నిలుపుదల చేయాలని ఆ స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, డిమాండ్కు అనుగుణంగా 5000 కొత్త బస్సులను వెంటనే కొనాల్సిన అవసరం ఉందని, డిపోలో జరుగుతున్న కొన్ని సమస్యల గురించి తమదాకా వచ్చిందని వాటి గురించి పరిష్కార దిశగా కర్నూల్ లోని డి పి టి ఓ తో మాట్లాడతామని, సమస్యలు పరిష్కరించే దిశగా చూస్తామని ఆయన అన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త బస్సులు వచ్చి బి6 , బిఫోర్ అంటూ వచ్చిన బస్సులకు రిపేర్ చేయుటకు అన్ని డిపోలకు మెకానిక్ సోదరులకు సరిపోవు పనిముట్లు ఇవ్వాలని వీలైతే వారిని కొత్తగా వచ్చిన బస్సులను ఎలా రిపేర్ చేయాలో ట్రైనింగ్ ద్వారా తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ,కార్యదర్శులు ఎస్ఎం రఫీ, ముస్తాక్ అహ్మద్ గ్యారేజీ కార్యదర్శి భాస్కర్ పెయింటర్, జిబి నవాజ్, కే మదర్ సాబ్, ఎమ్మెల్ రెడ్డి, ఏమండీ షరీఫ్, బజార్ అప్ప, తదితరులు పాల్గొన్నారు.