PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోటా పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం..

1 min read

ధ్యాన్ చంద్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి:బద్దుల శ్రీధర్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ధ్యాన్ చంద్ ను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని 29వ వార్డు కౌన్సిలర్ గుర్రాల భాస్కర్ రెడ్డి అన్నారు.ధ్యాన్ చంద్ కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించాలని రాష్ట్ర జూడో అసోసియేషన్ చైర్మన్ బద్దుల శ్రీధర్ అన్నారు.గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత కోట పాఠశాలలో రాష్ట్ర మరియు జిల్లా విద్యా శాఖ అధికారుల ఆదేశాల మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీం భాష ఆధ్వర్యంలో పాఠశాల ఫిజికల్ డైరక్టర్ పెరుమాళ్ల  శ్రీనాథ్ నిర్వహణలో హాకీ మాంత్రికుడు పద్మ భూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మ దినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ గుర్రాల భాస్కర్ రెడ్డి,విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు మరియు జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల శ్రీధర్, హాజరై ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 1928 అమస్టర్డ్యాం 1932 లాస్ ఏంజిల్స్ 1936 బెర్లిన్ లలో భారత దేశం హాకీ నందు స్వర్ణ పతకం సాధించడానికి కారణం స్వర్గీయ ధ్యాన్ చంద్ అని గుర్తు చేశారు.భారత ఆర్మీ లో ఒక సిపాయి స్థాయి నుంచి మేజర్ అయిన చరిత్ర కలిగిన ఏకైక క్రీడాకారుడు ధ్యాన్ చంద్ మాత్రమేనని తన క్రీడా జీవితంలో వేయి పైచిలుకు గోల్స్ చేయడం ఒక్క ధ్యాన్ చంద్ కే సాధ్యం అయిందన్నారు.అనంతరం బైరెడ్డి నగర్ లో క్రీడా జ్యోతి చేత బట్టి నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు క్రీడా వికాస కేంద్రం డియస్ఏ జూడో కోచ్ శాంతరాజు,పాఠశాల ఉపాధ్యాయులు సాలమ్మ ,లలితమ్మ,సరోజినీ దేవి,షంశాద్ బేగం, ఉపాద్యాయులు వెంకట రమణ,వెంకటేశ్వర్లు,మల్లిఖార్జున రెడ్డి,రామిరెడ్డి,మురళీకృష్ణ , పాములేటమ్మ పాల్గొన్నారు.

About Author