జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: భారతదేశపు మొట్టమొదటి మహిళా పాఠశాల ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం ఈసందర్భంగా శుక్రవారం ప్యాపిలీ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మహిళా పాఠశాల ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి ని జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.అని బాలికల విద్య కోసం పోరాడి భారతదేశంలో విప్లవాన్ని రేకెత్తించిన ఒక అద్భుతమైన మహిళను స్మరించుకునే రోజుది.సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు. 1848లో, ఆమె సామాజిక నిబంధనలను ఉల్లంఘిస్తూ పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించింది.NSS ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి మాట్లాడుతూ సావిత్రీబాయి మరియు జ్యోతిరావు ఫూలే తమ జీవితాలను సంఘ సంస్కరణకు అంకితం చేశారు. వారు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి అట్టడుగు కులాల అభ్యున్నతికి కృషి చేశారు అని విద్యార్థులకి తెలిపారు.ఆమె ను ఆదర్శనంగా తీసుకొని బాలికలు ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు:అధ్యాపకులు :రామకృష్ణయ్య సత్య బాబు నవీన్ ,ఓబులేసు ,ముస్తాక్ ,వెంకటరమణ ,వెంకటేశ్వర్లు ,మద్దిలేటి ,శంకరయ్య ,ఆదిలక్ష్మి ,సువర్ణ మరియు NSS వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.