రాష్ట్ర స్థాయి పోటీల్లో నవనంది పాఠశాల విద్యార్థి ప్రతిభ..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర స్థాయి జూడో ఆటల పోటీల్లో శ్రీ నవనంది పాఠశాల విద్యార్థి మంచి ప్రతిభ కనబరిచారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని నవనంది హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న ఎస్ ముర్తు జావలి డిసెంబర్ నెలలో 26 నుంచి 29 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయిలో జరిగిన జూడో పోటీల్లో విద్యార్థి 55 కేజీల విభాగంలోమొదటి స్థానంలో నిలిచాడని పాఠశాల చైర్మన్ బద్దుల శ్రీధర్ బుధవారం తెలిపారు.ఈనెల 18 నుంచి 22 వరకు జరగబోయే సబ్ జూనియర్ జాతీయ స్థాయి జూడో పోటీల్లో కూడా ఈ విద్యార్థి పాల్గొంటూ ఉన్నారని అన్నారు.ఉన్నత ప్రతిభ కనబరిచిన ముర్తు జావలికి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మెడల్స్ అందజేసినట్లు ఆయన తెలిపారు.పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థి ముర్తు జావలిని పాఠశాల చైర్మన్ మరియు సిబ్బంది అభినందించారు.