రైతులను ఆదుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం… ఎమ్మెల్యే
1 min readఎన్టీఆర్ జలాశయం నుంచి మద్రాస్ కాలువకు నీటి విడుదల.
నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు పథకంలో భాగమైన ఎన్టీఆర్ జలాశయం నుంచి హెడ్ రెగ్యులేటర్ ఒకటో గేటు ద్వారా మద్రాసు కాలువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ జూలై నెలలోనే రాష్ట్రంలోని ప్రాజెక్టులన్ని నిండటం రాష్ట్రములోని రైతాంగానికి శుభ పరిమాణం అన్నారు. వరద నీటిని మళ్లించి రాయలసీమ రైతులను కాపాడటమే ముఖ్యమంత్రి చంద్ర నాయుడు ప్రయత్నమని, ప్రతి ఎకరాకు సాగునీటిని విడుదల చేస్తామని అన్నారు. ఐదు సంవత్సరాల దుర్మార్గపు పరిపాలనలో రైతులను ఇబ్బందులకు గురిచేసి సాగునీటి విడుదల చేయకుండా, వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోకుండా రైతులకు వైసిపి నాయకులు ద్రోహం చేశారని అన్నారు. బాబు వస్తే వర్షాలు పడవు అనే దరిద్రులు ఇప్పుడు సమాధానం చెప్పాలని బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమలో సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదు అయ్యిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వము ప్రాజెక్టుల కు కేవలం 2000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, గతంలో టిడిపి ప్రభుత్వము 12 వేల కోట్లు ప్రాజెక్టుల కొరకు ఖర్చు చేసిందని అన్నారు. రాయలసీమ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి రాష్ట్ర వాటా ప్రకారము కృష్ణా జలాలను 25 టీఎంసీల నీటిని తీసుకోవాల్సి ఉందని అన్నారు. మద్రాసు కు త్రాగునీటిని తీసుకువెళ్లే ప్రణాళిక ప్రకారం ఓపెన్ కాల్వ లేదని,పైపుల ద్వారానీటిని మద్రాస్ కు తీసుకెళ్లాలని ఉంది. అప్పటి ముఖ్యమంత్రి ఏన్ టి రామారావు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ను ఒప్పించి రాయలసీమ అభివృద్ధి కోసం ఓపెన్ కాల్వ ను త్రవ్వించిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అని బుడ్డా తెలిపారు. అందులకు తెలుగు గంగ ప్రాజెక్టు ను 16టి ఎం సి లతో నిర్మించి రాయలసీమ లోని ఒక లక్ష 50వేల ఎకరాలను సస్య శ్యామలం చేయడం జరుగుతుందనిఅన్నారు . నేను శాసనసభ్యులు గా ఉండగా, మద్రాస్ కాల్వ కు లైనింగ్ లేక 2వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ తీసుకునే సామర్థ్యం లేక పోయిందని, . 0 కిలోమీటర్ నుంచి 18కిలోమీటర్ వరకు లైనింగ్ కొరకు నిధులు తెస్తే, 5 ఏళ్ళు పాలన చేసిన ఈ వైసిపీ దద్దమ్మలు లైనింగ్ పూర్తి చేయలేదని , కాంట్రాక్ట్లు లకు డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు.మిగిలిన లైనింగ్ పనులను పూర్తి చేసి రైతులకు రెండు కార్లకు నీరు ఇచ్చే పరిస్థితి తీసుకు వస్తామని,. అధికారులతో మాట్లాడి, ఎండా కాలం లో రెండు నెలల్లో లైనింగ్ పూర్తవుతుందో లేదో నని సమీక్షించి సాగునీటిని విడుదల చేస్తామని, ఒక వేళ లైనింగ్ పూర్తి కాకపోతే, రైతులు ఒక ఎండాకారు త్యాగం చేయాల్సి వస్తుందని అన్నారు. గత ఏడాది రిజర్వాయర్ లో నీరు ఉన్నా, సక్రమమైన మేనేజ్మెంట్ లేక నీరు కాళీ చేసారని అన్నారు. రిజర్వాయర్ గేట్ల నుంచి మద్రాస్ కాల్వ కు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశామని, సాయంత్రం 3 వేలు, శనివారం నుంచి 5 వేల క్యూసెక్కులు విడుదల చేస్తామన్నారు. కాల్వ లో నీటి ప్రవాహం ఉదృతంగా ఉంటుందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాదాలు జరుగుతాయని, అధికారులు దండోరా ద్వారా అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగు గంగ ఎస్. ఈ సుబ్బరాయుడు,ఇ. ఇ వెంకటేశ్వర్లు, డి.ఇ ఇ లు రమేష్, వెంకటేశ్వర్లు ఏ. ఇ లు, వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాల రైతులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.