ఎన్డీఏ. కూటమి ఆధ్వర్యంలో పంద్రాగస్టు బైక్ ర్యాలీ..
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల : స్వాతంత్ర్యం దినోత్సవాన్ని పురస్క రించుకుని ఈనెల 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు ద్వారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ‘హర్ ఘర్ తిరంగ’ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి బస్టాం డ్ వరకు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతీ ఒక్కరిలో జాతీయతా భావం పెంపొందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం విక్టర్ ఇమ్మానియేల్, పార్టీ ఓబీసీ మోర్చ మండల నాయకులు మంజుల వెంకటరమణ, టిడిపి మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి, జనసేన మండల నాయకులు కురువ శివ సాయిరాం, కొర్రపోలూరు సర్పంచ్ మాలిక్ భాష, మాజీ సర్పంచ్ జమాల్ బాషా, ఎక్స్ ఆర్మీ జమాల్ భాష, బిజెపి పాణ్యం మండల అధ్యక్షుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.