కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే శాశ్వత అంధకారానికి లోనవుతారు
1 min readబాల సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారమునగాల గ్రామంలో ఉన్న బాల సాయి కంటి వైద్యశాల ఆవరణలో
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బాల సాయి ట్రస్ట్ మేనేజర్ రామారావు సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగమైన కంటిని సమస్యల నుండి జాగ్రత్తగా కాపాడుకోవాలని, కంటి సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స అందేలా చూసుకోవాలన్నారు. చెవి ,ముక్కు ,గొంతు వైద్య నిపుణులు డాక్టర్ బాల ఈశ్వర్ మాట్లాడుతూ ఈ కాలుష్య వాతావరణం లో తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడానికి లయన్స్ క్లబ్ ముందుంటుందన్నారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో డాక్టర్లను సన్మానించారు. వైద్య పరీక్షలు అనంతరం ఉచితంగా కంటి అద్దాలు మరియు కంటికి సంబంధించిన మందులను 100 మందికి పైగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీ మద్దయ్య, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.