PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ పెన్షనర్లను నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ హత్యతో సమానం..

1 min read

రిటైర్డ్ అయిన ఉద్యోగి కి పెన్షన్ నే అన్ని విధాల ఆధారం

కూటమి అభ్యర్థులను గెలిపించండి, రాష్ట్రాన్ని కాపాడండి

ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు

పి సుబ్బరాయన్, బి పెద్దన్న గౌడ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి, ప్రభుత్వ పధకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు, సమాజానికి చేరవేస్తూ, అటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు, కరోనా లాంటి ఉపద్రవాలు సంభవించి నప్పుడు, ప్రభుత్వోద్యోగులు మాత్రమే ముందుండి ప్రజా ప్రాణ, ఆస్తులను కాపాడే కార్యక్రమాల్లో ముందుంటారని  ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పి సుబ్బరాయన్ , బి పెద్దన్న గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక ఎన్ ఆర్ పేట గ్రాండ్ ఆర్య లో  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సందర్భాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేటప్పుడు అనారోగ్యాల కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయి, వారి కుటుంబ సభ్యులు అనాధలు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అటువంటి నిజమైన ప్రజా సేవకులను, రిటైర్ అయిన తరువాత ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. రిటైర్మెంట్ అయిన తరువాత సీనియర్ సిటిజన్స్ అయి, వయస్సు ఉడిగి, అనారోగ్యాలతో, బ్రతుకు భారంగా బ్రతుకుతున్న మా పెన్షనర్లకు ఉన్న ఒకే ఒక ఆధారం ” పెన్షన్”. ఈ పెన్షన్ మీదనే ఆధారపడి మా మందుల నిత్యావసర వస్తువుల కొనుగోలు గానీ, ఆరోగ్య పరమైన డాక్టర్ కనల్టేషన్లు, ఆరోగ్య పరీక్షలు ఆధారపడి బ్రతుకుతున్నాం. అలాంటి దూర్భర పరిస్థితుల్లో వున్న మా పెన్షనర్లకు 1 వ తేదీ నాడు రావాల్సిన మా పెన్షన్లు ఎప్పుడో నెల మద్యలో 20 తేదీ వరకూ వస్తుంటే, ఈ లోగా కావాల్సిన మందులు ఇతర అవసరాలకు డబ్బులు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందరికో 1st తారీఖున ఠంచనుగా ప్రతి నెలా పెన్షన్లు, ఇతర పధకాల లబ్ధిదారులకు ఠంచనుగా ఇళ్ళకు లేదా వారి ఎకౌంటు లలో బటన్ నొక్కి డబ్బు వేసే జగన్ మా పెన్షనర్లను నడివీధి కి వీడ్చాడన్నరు. మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించి, ఆరోగ్యాలు క్షీణించి, పెన్షన్లు మీద ఆదారపడి బ్రతుకుతున్న మమ్మల్ని,జగన్ రెడ్డి గుర్తుంచుకోక పోవటం శోచనీయమన్నారు. మా పట్ల తీవ్ర నిర్లక్ష్యం వల్ల మాత్రమే కాదు. ఇవి ప్రభుత్వ హత్యలతో సమానమన్నారు. మాకు రావాల్సిన బకాయిలు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకుండా మమ్మల్ని పట్టించు కోకపోవడం, మాకు  చంద్రబాబు నాయుడు  ఇచ్చిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడం, మెడికల్ బిల్లులు అయితే 2 సంవత్సరాలు గడుస్తున్నా రాకపోవడం, మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంవత్సరాలు గడుస్తున్నా పెన్షనర్లకు అందించకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. చంద్రబాబు నాయుడు కష్టపడి ప్రధాని మోదీ చేతుల మీదగా నిర్మించిన అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని అనాధగా చేసిన జగన్ నుండే రాష్ట్రాన్ని రక్షించాలని  ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ నిర్ణయించిందన్నారు. రాష్ట్రాని యువతతో పాటు రాబోయే తరాలను కూడా రక్షించాలంటే చంద్రబాబునాయుడు నాయకత్వం యొక్క అవసరాన్ని గుర్తించాలన్నారు. బాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మద్దతు ఇచ్చి మీ ఓటు వేసి ప్రతి అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కూటమి  అభ్యర్థులను గెలిపించాలని మా ఆంధ్ర పెన్షనర్స్  పార్టీ విజ్ఞప్తి చేసిందన్నారు. కార్యక్రమంలో కోశాధికారి టి నాగభూషణం, సత్యనారాయణమూర్తి, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author