హైవే రోడ్డు అధికారుల నిర్లక్ష్యం సీపీఎం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు హైవే రోడ్డు అధికారుల నిర్లక్ష్యంతో హంద్రీ నీవాకు నీరు నిలుపుదల చేశారని సిపిఎం నాయకులు పక్కిర్ సాహెబ్,గోపాలకృష్ణ, వేణుగోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామం దగ్గర హైవే రోడ్డు అధికారులు హంద్రీ నీవాలో నీళ్లు వెళ్లకుండా వేసిన మట్టి అడ్డుకట్టను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాల హంద్రీనీవా సుజల స్రవంతి పథకం క్రింద మల్యాల లిఫ్ట్ నుండి కర్నూలు అనంతపురం జిల్లాలకు సాగు త్రాగునీరు అందించేందుకు చేపట్టిన మల్యాల ఎత్తిపోతల పథకం నుండి నీటిని అందించే ప్రక్రియ జరుగుతుందని అన్నారు. అయితే ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడంతో శ్రీశైలం డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడం జరిగిందని అయినప్పటికీ హంద్రీనీవాకు నీటిని ఇప్పటికీ వదలక పోవడానికి కర్నూలు ఆత్మకూరు వెళ్లే హైవేరోడ్డు నిర్మాణంలో హంద్రీనీవా వంతెనకు అడ్డుకట్ట వేసి సకాలంలో తీయకపోవడంతో నే హంద్రీనీవాకు నీటి విడుదల కష్ట సాధ్యం అయిందని అన్నారు.తక్షణమే హైవే అధికారులు మట్టి కట్టను తొలగించి హంద్రీనీవాకు సాగు త్రాగు నీరు అందించాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతులు శ్రీకాంత్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.