ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం తగదు..ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురి అయిందని, ఎన్నో ఆశలు ఆకాంక్షలతో నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అయితే నూతన ప్రభుత్వం వైఖరి ఆశాజనకంగా లేదని, ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రతినెల ఒకటో తేదీ జీతాలు జమ చేస్తామన్న మాట నిలుపుకోవడం లేదని, ఉపాధ్యాయులపై పనిభారం మరియు ఒత్తిడి ఏమాత్రం తగ్గలేదని, యాప్లు రద్దు చేస్తామన్న ప్రభుత్వం రోజురోజుకు యాప్ ల సంఖ్య పెంచుతుందని, ఇంకా రకరకాల కారణాలతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నదని, ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక బకాయిల విషయంలో కూడా ఏమాత్రం పట్టించుకోవడంలేదని, 12వ పిఆర్సి ఊసే లేదని, మద్యంతర భృతి గురించి ఆలోచన చేయడం లేదని, డిఏ లకు అతి గతి లేకుండా పోయిందని,సకాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పరిపాలనాపరంగా ఎటువంటి మార్పు కనపడడం లేదని , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం గా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శవన్న బాలాజీ, ప్రధాన కార్యదర్శి జి వి సత్యనారాయణ ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని యస్ బాలాజీ చరాష్ట్ర అధ్యక్షులుఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేశారు.