శ్రీ సరస్వతీ శిశు మందిరంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలీ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో 128వ సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈసందర్భంగా గురువారం ప్రధానచార్యులు డి. రామాంజినేయులు చిత్రపటానికి మాల వేసి ప్రసంగించారు. ఈయన 1897వ సంవత్సరం లో కటక్ లో జన్మించాడని, ఈయన గొప్ప స్వతంత్ర సమరయోధులు అని ఆంగ్లేయులపై పోరాటం సాధించాడని జైహింద్ అనే నినాదం తో ముందుకు సాగారని,స్వామి వివేకానంద పుస్తకాలు చదివారాని రామకృష్ణ మఠం సందర్శించాడని, ఈయన తిలక్, మహాత్మ గాంధీ తో కలిసి పోరాటం సాగించారాని వాళ్ల తండ్రి జానకి నాథ్ కి 14మంది సంతానంలో ఈయన 9వ వారని తెలిపిరి. ఈ కార్యక్రమం లో ఆచార్యులు, పిల్లలు పాల్గొన్నారు.