నేత్రదానం మహాదానం… కంటి అద్దాల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు రోటరీ క్లబ్ మరియు ఆర్ కె కంటి వైద్యశాల సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నందు ఈరోజు ఉదయం ఆర్ కె కంటి వైద్యశాలలో పాల్గొన్న 35 మంది నేత్ర చికిత్సల అనంతరం ఉచితంగా కంటి ఆపరేషన్లు జరిపి 35 మంది కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఆర్ కె కంటి వైద్యశాల ప్రధాన వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ చే ఉచిత నేత్ర కంటి అద్దములు అందజేయడం జరిగింది. డాక్టర్ హేమంత్ కుమార్ పేద ప్రజలకు ఎందరికో కంటి చూపు ప్రసాదిస్తున్నటువంటి ప్రధాన వైద్యులు, కంటి అద్దాల పంపిణీ, నేత్ర వైద్య శిబిరానికి రోటరీ క్లబ్ సభ్యులు బైలుప్పల షఫీయుల్లా, పీ కేశవరెడ్డి, మాచాని వెంకటేష్, పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి కంటి వైద్య సేవలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ డాక్టర్ సేవలకు అభినందనలు తెలియజేశారు.