నూతన ఆలూరు అసెంబ్లీ కమిటీ ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలంలో ఎస్. డి. పి. ఐ. రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అత్తవుల్లా ఖాన్ అధ్యక్షతన హొళగుందలో ఆలూరు అసెంబ్లీ కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు F.అబ్దుల్ హామీద్ ఉపాధ్యక్షులు K. అబ్దుల్ రహమాన్ జనరల్ సెక్రెటరీ N. అబ్దుల్ సుభాన్ సెక్రెటరీ M. హాఫీజ్ మరియు సలాం ట్రెజరర్ B. అల్లా బాకాష్ అసెంబ్లీ కమిటీ నెంబర్లు S.MD. షఫీ అస్లాం. రహమతుల్లా. K.భాష .F మహేఫ్యూజ్ బక్షి మరియు వజీద్ లను ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా ఎస్ డి పి ఐ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతవుల్ల ఖాన్ రావడం జరిగింది .అలాగే రాష్ట్ర ఆర్గనైజర్ జనరల్ సెక్రెటరీ అబ్దుల్ ఘని . మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు హఫీజ్ అబ్దుల్ శుకుర్ . పాల్గొనడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు హాపీజ్ అత్త వుల్ల ఖాన్ మాట్లాడుతూ ఎస్డిపిఐ పార్టీ 14 రాష్ట్రాలలో పనిచేస్తున్న జాతీయ పార్టీ అని అన్నారు ఎస్ డి పి ఐ పార్టీ కుల మతాలకు అతీతంగా అందరిని రాజకీయంగా ముందుకు నడిపించడానికి పనిచేస్తుందన్నారు. మా ఎస్ డి పి ఐ పార్టీ యొక్క నినాదం “ఆకలి నుండి స్వేచ్ఛ” “భయం నుండి స్వేచ్ఛ” అనే నినాదంతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ అన్నారు. దేశంలో ఆణ గారిన వర్గాలైన మైనార్టీలు దళితులు ఆదివాసుల గొంతు గా ఎస్ డి పి ఐ పార్టీ ఉందన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యన్మాయ పార్టీగా ఎస్డిపిఐ నిలుస్తుందన్నారూ. అందుకే ఎస్ డి పి ఐ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ డి పి ఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.