PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ సందడి..

1 min read

పల్లెవెలుగు వెబ్  ఓర్వకల్లు: ఓర్వకల్లు  రాక్ గార్డెన్( రాతి వనాల) లో గురువారం నాడు నందనూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందడి నెలకొంది సితార ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ లో సూర్యదేవర నాగావంశీ నిర్మాతగా బాబి దర్శకత్వంలో బాలకృష్ణ,  ప్రత్యజ్ఞ జ్వాల హీరోయిన్ గా బాలకృష్ణ 109  వ సినిమా లో నటిస్తున్నారు .షూటింగ్ సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు సీఐ ఇద్దరు ఎస్ఐలతో బందోబస్తును పర్యవేక్షించారు.   సీఐ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఓర్వకల్లు  ఎస్ఐ  రాజారెడ్డి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా    భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షూటింగ్ పరిసర ప్రాంతంలో ప్రజలను అనుమతించలేదు. మూడు రోజులపాటు బాలకృష్ణ  సినిమా షూటింగ్ చేయనున్నారు. ఓర్వకల్ రాక్ గార్డెన్ లో  పాట, విలన్ తో కొన్ని సీన్లు  చిత్రీకరించనున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ సినీ హీరో నట సింహం బాలకృష్ణ రావడంతో అధిక సంఖ్యలో  షూటింగ్ చూడటానికి అభిమానులు భారీ ఎత్తున వస్తారన్న నేపథ్యంలో  150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ చిత్రం షెడ్యూల్ రెండ్రోజులపాటు రాక్ గార్డెన్ (రాతివానాల)లో చిత్రీకరణ జరుగుతుందని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు.రాతి వనాలలో సినిమా షూటింగ్ ప్రారంభించి సినిమా విడుదలయితే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని నమ్మకంతో సినీ నిర్మాతలు రాతి వనాలలో  షూటింగ్ జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా డోన్ టిడిపి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ప్రముఖ టిడిపి నాయకుడు తుగ్గలి నాగేంద్ర బాలకృష్ణతో షూటింగ్ లొకేషన్లో కలిశారు.

About Author