PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిఎస్ఎన్ఎల్ లో ‘నూతన’ ఆఫర్లు…

1 min read

విద్యామిత్రం’ కు దాతలు ముందుకు రావాలి

వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి

కర్నూలు జిల్లా టెలికాం జనరల్ మేనేజర్  జి .రమేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ  భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్( బీఎస్ఎన్ఎల్)  నూతన సంవత్సరం సందర్భంగా వినూత్న ఆఫర్లు మరియు  సర్వీసులను వినియోగదారులకు అందజేస్తుందని కర్నూలు జిల్లా టెలికాం జనరల్ మేనేజర్ శ్రీ  జి .రమేష్ గారు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం తన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 210   ఓ ఎల్ టి ఈ లతో సుమారు   16,400 భారత్ ఫైబర్ (ఎఫ్ టి టి హెచ్) కస్టమర్లకు  నాణ్యమైన సేవలను అందిస్తున్నామన్నారు.   త్వరలోనే మిషన్ 20 కే  నినాదంతో మా టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్  మరియు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు  సమిష్టి కృషితో 20వేలకు ఎఫ్ టి టి హెచ్  కనెక్షన్లను అతి త్వరలోనే  వినియోగదారులకు ఇస్తామని తెలిపారు.

4జి  సేవలు ప్రారంభం:

కర్నూలు మరియు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 346 మొబైల్ టవర్లకు గాను 303  టవర్లను 4G టవర్లలగా మార్చడం జరిగిందని తెలిపారు. ఇంతవరకు ఏ టెలికాం ఆపరేటర్ కూడా మొబైల్ సేవలను అందివ్వని 7 ప్రాంతాలైన ప్యాపిలి మండలంలోని  వెన్హలంపల్లి,  బనగానపల్లి మండలంలోని కటిక వాణి కుంట మరియు రామతీర్థం,  ఆస్పరి మండలంలోని యాటకల్లు , దేవనకొండ మండలంలోని పులికొండ , హాలహరి మండలంలోని విరుపాపురం,  పెద్దకడబూరు లో మండలంలోని దొడ్డి మేకల పల్లి ప్రాంతాలలో మొబైల్ టవర్లను కొత్తగా  4g శాచ్యురేషన్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశామని తెలిపారు .

నూతన సంవత్సర కొత్త ఆఫర్లు  :

 బిఎస్ఎన్ఎల్ ఎఫ్టిటిహెచ్ సర్వీస్ లలో కొత్తగా భారత్ ఫైబర్ త్రైమాసికం మరియు అర్థ సంవత్సరం  బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టామని తెలిపారు.  ఫైబర్ ఎంట్రీ క్వార్టర్లీ ప్లాను కింద 999 రూపాయలతో 25  ఎం బి పి ఎస్ స్పీడుతో   1200 జీబి వరకు ,  మరియు ఫైబర్ ఎంట్రీ అర్థ సంవత్సరం ప్లాన్ కింద 1999 రూపాయలతో 25 ఎంబిబిఎస్ స్పీడుతో  1300జిబి వరకు అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల వారికి అందజేస్తామని తెలిపారు.

 బిఎస్ఎన్ఎల్ వైఫై రోమింగ్ సేవలు..

బిఎస్ఎన్ఎల్ ఎఫ్ టి టి హెచ్ నెట్వర్క్ ద్వారా   కొత్త సర్వీసును ” బిఎస్ఎన్ఎల్ వైఫై”  సర్వీసును ప్రారంభించిందని కర్నూలు బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ జి రమేష్ తెలిపారు. ఈ సృజనాత్మక సర్వీసు ద్వారా బిఎస్ఎన్ఎల్ ఎఫ్.టి.హెచ్ కస్టమర్లు పాన్ ఇండియా రోమింగ్ లో కూడా ఇంటర్నెట్ సర్వీసును ఎటువంటి అంతరాయం లేకుండా పొందవచ్చని తెలిపారు . మరియు ఎఫ్ టి టి హెచ్ కస్టమర్లు ఎంపిక చేసిన వైఫై హాట్స్పాట్ల దగ్గర కూడా హై స్పీడ్ వైఫై కనెక్టివిటీని పొందవచ్చని తెలిపారు. 

దాతలకు కొత్త స్కీమ్ “విద్యామిత్రం”.

విద్యార్థులకు లేదా ఇతర అర్హులకు వ్యక్తిగతంగా కానీ సంస్థగా కానీ విరాళాలు ఇవ్వ తలచిన  వారికి  బిఎస్ఎన్ఎల్  ” విద్యామిత్రం” అనే కొత్త స్కీంను ప్రవేశపెట్టింది.   స్కీం కింద 329 ప్లాన్ (ఫైబర్ ఎంట్రీ ప్లాన్ ) సంవత్సర చందాతో ముగ్గురికి విరాళం ఇస్తే 11,000 రూపాయలు మరియు ఆరుగురికి విరాళం ఇస్తే 21 వేల రూపాయలు, 10 ఇంటర్నెట్ కనెక్షన్లు విరాళంగా ఇస్తే 35 వేల రూపాయలు మాత్రమే తగ్గింపు ధరలో  ఇవ్వవచ్చు .ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె .రాజేశ్వర రావు, ఐ .ఎఫ్. ఏ  డి. శ్రీలత ,  ఏజీఎం ఆపరేషన్ శ్రీ పి. శ్రీనివాసరావు,  ఏజీఎం అడ్మిన్ వి. శ్రీను నాయక్ ,  ఏజీఎం డోన్ జి.నారాయణస్వామి,  ఏజీఎం మొబైల్ ఇన్స్టాలేషన్ శ్రీ  ఎన్.  చంద్రశేఖర్,   ఏజీఎం  ట్రాన్స్మిషన్ శ్రీ జి. వి .మురళీకృష్ణ , ఏజీఎం ప్లానింగ్ శ్రీ వి. జాన్సన్ మరియు సబ్ డివిజనల్ ఇంజనీర్స్ , ఇతర సిబ్బంది ,విశ్రాంత ఉద్యోగులు, అసోసియేషన్ మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *