ఏపీ రజక వృత్తిదారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద మండలం లో శ్రీ సిద్దేశ్వర స్వామి గుడి ఆవరణము నందు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు అధ్యక్షతన జరిగింది. రజకవృత్తిదారు క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమాని ఉద్దేశించి చాకలి మంగయ్య. lic లక్ష్మని.మల్లికార్జున.మహేష్ మాట్లాడుతూ.ఈ రాష్ట్రంలో రజకులకు సామాజిక భద్రత లేదని రజకుల పట్ల దాడులు మహిళలు, బాలికలపై అత్యాచారాలు నేటికీ కొనసాగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మాదిరిగా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు. .రజక కార్పొరేషన్ కి (వెయ్యి )1000 కోట్లు కేటాయించాలని చెప్పారు. రజక వృత్తిదారులకు కార్పొరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో ప్రతి కుటుంబానికి వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు కుటుంబాల అభివృద్ధి చెందేందుకు లక్ష రూపాయలు రుణాలు ఇవ్వాలని చెప్పారు. 50 సంవత్సరాలు పూర్తయిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వృత్తి చేసేవారికి చెరువులు, దోబీఘాట్ స్థలాలు పైన రజకులకు పూర్తి హక్కు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ధోబి పోస్ట్లు భర్తీ చేసి యువతీయువకులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కొరకు దశలవారీ పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రజకులు కు ఇచ్చిన హామీల అమలు చేయాలని వారు అన్నారు.రాష్ట్రంలో ఇళ్ల దగ్గర వృత్తి చేసే వారందరికీ 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు.రజకుల ఐక్యంగా రాష్ట్రంలోనూ జిల్లాలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని రజక వృత్తి ని కాపాడేందుకు ఈ ప్రభుత్వమైనా చొరవ చూపాలని చెప్పారు.ఈ కార్యక్రమం. ఉదయ్ కరెంటు మల్లి సున్నం వీరేష్ నాగప్ప ఎల్లప్ప శివ శేఖర్ హనుమేష్ కృష్ణ రమేష్ రంగస్వామి రాజా గాది మల్లి మంజు రమేష్ రామకృష్ణ ప్రకాష్ రాము వీరేష్ కుబేర రాజశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు.