“డ్రగ్స్ వద్దు బ్రో” పోస్టర్లు ఆవిష్కరణ..ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ..
1 min readఆవిష్కరణ చేసిన… ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ.. కర్నూలు జిల్లా ఎస్పీ
కప్పట్రాళ్ళ గ్రామం ప్రపంచ స్ధాయిలో మొదటి స్ధానంలో నిలవాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి…గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలి.
దేవనకొండ మండలం, కప్పట్రాళ్ళ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలలో ” మెగా టీచర్స్ పేరెంట్ ” మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న … ఈగల్ ఐజి , కర్నూలు జిల్లా ఎస్పీ .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని, సమిష్టి కృషితో డ్రగ్స్ ను పారద్రోలుదామని ఈగల్ ఐజి శ్రీ ఆకే రవికృష్ణ ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్లు పిలుపునిచ్చారు. శనివారం దేవనకొండ మండలం , కప్పట్రాళ్ళ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో ” మెగా టీచర్స్ పేరెంట్ ” మీటింగ్ నిర్వహించారు. ఈగల్ ఐజి , కర్నూలు జిల్లా ఎస్పీ, ఈగల్ ఎస్పీ లు ముఖ్య అతిథిగా పాల్గొని ” డ్రగ్స్ వద్దు బ్రో ” అనే కార్యక్రమం పై అవగాహన చేశారు. ఈసందర్భంగా ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ మెగా టీచర్స్ పేరెంట్ ” మీటింగ్ కార్యక్రమాన్ని ఈ రోజు 40 వేల పాఠశాలలో చేస్తుందన్నారు. సుమారు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు.కప్పట్రాళ్ళ గ్రామం ప్రపంచ స్ధాయిలో మొదటి స్ధానంలో నిలవాలన్నారు. గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలంటే పిల్లల తోనే సాధ్యమన్నారు.2015 లో అప్పటిరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గ్రామాలను దత్తత తీసుకోవాలని పిలుపు నిచ్చారన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు పూర్వపు కర్నూలు ఎస్పీ గా పని చేసే సమయంలో కప్పట్రాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామం మా కుటుంబం లో భాగమయిందన్నారు. రాష్ట్రంలో గంజాయి , డ్రగ్స్ ఎక్కడ ఉండకూడదని ఒక క్యాబినేట్ సబ్ కమిటిని ఏర్పాటు చేశారన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి ఆదేశాల మేరకు విద్యార్ధులతో కలిసి ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ పోస్టర్స్ ఆవిష్కణలో “డ్రగ్స్ మిమ్మల్నే కాదు, మీ కుటుంబాలని నాశనం చేస్తుంది”, “బాల్యాన్ని బలి తీసుకుంటున్న డ్రగ్స్ మత్తులో పిల్లల పై అఘాయిత్యాలు “, “డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోంటున్న విద్యార్దులు “ అనే పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసుశాఖ కూడా భాగం కావాలని గౌరవ ఎడ్యూకేషన్ మినిష్టర్ నారా లోకేష్ సూచించారన్నారు. ఆ క్యాంపెయిన్ కార్యక్రమమే డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమమన్నారు. యువత తప్పు ద్రోవ పడకూడదన్నారు. విద్యార్దులు చదువుకోవాలి, సాధించాలంటే ఎక్కడ ఉన్నా సాధించవచ్చన్నారు. పుస్తకాలు బాగా చదవాలన్నారు. 10 వ తరగతిలో 100 శాతం ఫలితాలు ఈ స్కూల్ విద్యార్ధులు సాధించాలన్నారు. కుటుంబాలు గుంటూరు, తెలంగాణ ఎక్కడికైనా వలస వెళితే వారి కుటుంబాల పిల్లల కొరకు సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సహాకారంతో హస్టల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. కప్పట్రాళ్ళ గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు. ఒకే తాటి పై ఉండాలన్నారు. విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ మాట్లాడుతూ…ఆ క్యాంపెయిన్ లో పాల్గొని పోలీసు పరంగా డ్రగ్స్ అనర్థాలపై అవగాహన తీసుకురావడమే ముఖ్య ఉద్ధేశ్యమన్నారు.కప్పట్రాళ్ళ గ్రామంలో పిల్లలు అందరూ చక్కగా చదువుతున్నారన్నారు. ఇక్కడ లైబ్రరీ ఉండడంతో గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదివితే అవి మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఐజి ఆకే రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళ గ్రామానికి వస్తుండడంతో గ్రామ ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఉండడం కనిపించిందన్నారు. ఇలాంటి గ్రామ దత్తత కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని సర్వీస్ లో ఇలాంటివి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈరోజు నుండీ డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ప్రారంభమయ్యిందన్నారు.