PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైరెడ్డిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు

1 min read

డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మహిళను అవమాణించిన వైసీపీ కో అప్షన్ సభ్యుడు శ్రీనివాసరెడ్డిని ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో   మున్సిపాలిటీలో చైర్మన్ తో పాటు 20 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరితే అది పెద్ద నేరమైనట్లు అవాకులు, చవాకులు మాట్లాడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రాజశేఖర్ రెడ్డి విమర్శించే అర్హత ఎవరికి లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ అబ్దుల్ షుకూర్,బీసీ సెల్ మహిళా అధ్యక్షురాలు శైలజాలు అన్నారు.శనివారం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య  మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దొంగే దొంగ అన్నట్లుంది ఎమ్మెల్యే జయసూర్య మాటలు ఉన్నాయని వారు విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతున్నారని, అందులో భాగంగానే నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు కార్యకర్తలు టిడిపి లో చేరుతున్నారని అన్నారు.హుందాగా ఎమ్మెల్యే పదవికి గౌరవం తేవాలని ఎమ్మెల్యే పదవికి మచ్చ తీసుకురావద్దని ఎమ్మెల్యే జయసూర్య కు వారు హితవు పలికారు.మరో సారి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై నోరు పారేసుకుంటే ఎమ్మెల్యే అని చూడకుండా తగిన బుద్ధి చెబుతామని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే జయ సూర్యను హెచ్చరించారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ముజిపర్ రహేమాన్,అబ్దుల్లా,జనార్ధన్ నాయుడు,యస్వంత్,రాజేష్ పాల్గొన్నారు.

About Author