బీసీవై పార్టీ తరుపున కర్నూలు ఎం.పి.గా నామినేషన్ దాఖలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : BCY పార్టీ తరుపున కర్నూలు ఎం.పి.గా నామినేషన్ దాఖలు చేసిన ఆలూరు నియోజకవర్గం యువ నాయకుడు ఎల్లార్తి వాల్మీకి అర్జున్.కలెక్టరేట్ లో కర్నూలు పార్లమెంట్ కు సంబంధించి కర్నూలు -18 పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన కి నామినేషన్ పత్రాలు అందచేసిన భారత చైతన్య యువజన (BCY)పార్టీ కర్నూలు MP అభ్యర్థి వాల్మీకి అర్జున్.ఈ రోజు ఎల్లార్తి హజరత్ షాషా శెక్షావలి వార్ల దర్శనం చేసుకుని ఆలూరులో అంబెడ్కర్ విగ్రహానికి మరియు కర్నూలులో శ్రీ మహార్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో RO అధికారి డా.సృజనకి నామినేషన్ పత్రాన్ని అందించిడం జరిగింది. తర్వాత అర్జున్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అత్యధిక వున్న జనాబా వాల్మీకి సామాజికవర్గం కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిసివై (BCYP) పార్టీ పెట్టిన మొదటి సారే యువకులను గుర్తించి చిన్న వయసులోనే కర్నూలు జిల్లాలో నాకు MP కి అవకాశం ఇచ్చిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఖచ్చితంగా కర్నూలు జిల్లా నుంచి బిసివై పార్టీకి గెలుపు దిశగా కష్టపడి కర్నూలు జిల్లాలో వున్న అన్ని సమస్యలపై నిరంతరం పోరాటం చేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి గతంలో పార్టీలు చేసిన అరాచక పాలనపై ప్రజలలో చేరెంతవరకు పోరాటం చేసి ప్రజలలో మార్పులు తీసుకొస్తాననీ నేను ఈ రోజు BCY పార్టీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కర్నూలు జిల్లా ప్రజలందరికి తెలియజేసుకుంటున్నాను.కావున కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన ఓటరు మహాశయులందరికి పేరు పేరున వేడుకుంటూ మీ అమూల్యమైన ఓట్లను చెరుకు రైతు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను. ఈ రోజు నిర్వహించిన నామినేషన్ కార్యక్రమంలో తోటి కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.