PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

19 న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి  నామినేషన్ కార్యక్రమం..

1 min read

పెద్ద ఎత్తున పాల్గొనన్న పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు..

శ్రీ రాట్నాలమ్మవారిని దర్శించుకుని బైక్ ర్యాలీ తో ప్రారంభం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి  ఉదయం 8:00 గంటలకు రాట్నాలకుంటలోని శ్రీ రాట్నాలమ్మ తల్లి వారిని దర్శించుకుని, అనంతరం భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి సూర్యారావుపేట, పెదవేగి, గోపన్నపాలెం, సోమవరప్పాడు, ఆశ్రం హాస్పిటల్, పాలగూడెం, కొవ్వలి గ్రామాల మీదుగా దెందులూరు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని, అశేష జనవాహిని తోడుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మిత్రులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి తెలిపారు.

About Author