మంత్రాలయం లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు
1 min readవైకాపా తరుపున వై. బాలనాగిరెడ్డి, టిడిపి తరుపున రాఘవేంద్ర రెడ్డి
భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గం లో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళి కి మొదట గా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్ధి వై. బాలనాగిరెడ్డి నామినేషన్లు దాఖలు చేసి నామపత్రాలను సమర్పించారు. తర్వాత టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెంట వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, లాయర్ మాలపల్లి గురురాజరావు స్వామి,సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, టిడిపి అభ్యర్థి వెంట రాఖేష్ రెడ్డి, మల్లికార్జున, టిడిపి లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ వీరేష్, లాయర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.