రామనపల్లెలో ఆగని వలసలు
1 min read– టిడిపి కే సంపూర్ణ మద్దతు అంటున్న హరిజన వాడ వాసులు
-రామన శ్రీలక్ష్మి రామన చంద్రమోహన్ రెడ్డి, పుత్తా వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు చేరిక
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని రామనపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు రామన శ్రీలక్ష్మి, రామన చంద్రమోహన్ రెడ్డి, పుత్తా వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రామనపల్లి హరిజనవాడ10 దళిత కుటుంబాలు వైఎస్ఆర్సిపి నీ వీడి వారు శుక్రవారం టిడిపి కండువా వేసుకోవడం జరిగింది, ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ, జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం , జనసేన బిజెపి, కూటమి దుందుభి మోగిస్తుందని, చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారని , దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు, కమలాపురం నియోజకవర్గం లో యువ నాయకులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఒక ఆశయం ఉన్న నాయకుడని, ఆయన ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఆమె తెలిపారు, అందుకోసం మండల వ్యాప్తంగా తమ వంతు కృషి చేస్తామని మంచి మెజార్టీ వచ్చే విధంగా ఇష్టపడి పని చేస్తున్నామని ఆమె తెలియజేశారు, ఇప్పటికే తమ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వస్తుందని ఆమె తెలిపారు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎక్కువ కృషి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమేనని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమంలోజిల్లా టీడీపీ అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్, మండల క్లస్టర్ ఇంచార్జ్ తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి ( బుజ్జన్న), కార్యనిర్వాక కార్యదర్శి వేల్పుల సుబ్రహ్మణ్యం, టిడిపి సీనియర్ నాయకులు లేవాకు రమణారెడ్డి, శివారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ముండ్ల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.