చినుకు జాడలేదు. రైతు చింత తీరలేదు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గత సంవత్సరం వర్షాకాలంలో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సీజన్ లో నిండా మునిగిన రైతులు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ స్కైమేట్ అంచనా తో రైతులు ఆనందంగా దుక్కులు దున్ని విత్తనాలు వేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఇప్పటివరకు ఆశాజనకంగా వర్షాలు పడకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు ముందస్తు వానలు కురిసి కొద్దిపాటి ఆశలు కల్పించిన జూన్ నెలాఖరు వస్తున్న ఇప్పటివరకు వర్షాలు లేకపోవడం రైతులు దిగాలు చెందుతున్నారు భూమిలో వేడి తగ్గకపోవడంతో విత్తనాలు వేస్తే వర్షం పడకపోతే మొలకెత్తే అవకాశాలు లేవు మండల వ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాలలో ఖరీఫ్ సీజన్లో మేట్ట పొలాల్లో పంటలు వేస్తారు. ముఖ్యంగా సోయాబీన్ మినుములు మొక్కజొన్నలు అక్కడక్కడ కందులు పత్తి పంట ముఖ్యంగా వర్షాధారం పై ఆధారపడి పంటలు వేసే రైతులు జూన్ నెలాఖరు కావస్తున్నా వర్షాలు పడకపోవడంతో 5000 ఎకరాలు మాత్రమే పంట వేసినట్టు బోర్లపై ఆధారపడి విత్తనాలు వేసినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు వచ్చేనెల జూలై 15 లోపల వర్షాలు పడితే మొక్కజొన్న పత్తి పంట వేసే అవకాశం ఉంది . ఈ ఏడాది వ్యవసాయం మీద పెట్టుబడి పెరిగినట్టు విత్తనాలు పురుగు మందులు అడుగు మందులు ధరలు భారీగా పెరిగినట్టు రైతుల పేర్కొంటున్నారు.. వరుణ దేవుడు కరుణించకపోతే ఈ ఏడాది కూడా తమకు లాభాలు దేవుడు ఎరుగు భారీగా నష్టపోతామని . కౌలుకు తీసుకున్న రైతులు ముందస్తుగా కౌలు చెల్లించి పొలాలు సిద్ధం చేసి విత్తనాలు అన్ని సిద్ధం చేసుకున్నామని వర్షం పడకపోతే ఇక అంతే అని ఈసారైనా తమను కరుణించాలని వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.